వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను కడతేర్చాడు

 వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను కడతేర్చాడు

వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త..  ఈ ఘటన  రంగారెడ్డి జిల్లా  మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికంగా అమృత్ సాహు,  కవిత నివాసం ఉంటున్నారు. అయితే  తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో చంపేయాలనుకున్నాడు  అమృత్ సాహు. 

ఈ క్రమంలో  నిద్రిస్తున్న  కవిత తలపై బండరాయి తో మోది అంతమొందించాడు. స్పాట్ లోనే  కవిత ప్రాణాలు విడిచింది.  స్థానికుల సమాచారంతో  ఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు  అమృత్ సాహును అదుపులోకి తీసుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.