- పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని భర్త మృతి
- జగిత్యాల జిల్లా చింతకుంటలో ఘటన
కోరుట్ల, వెలుగు : భార్య కాపురానికి రావట్లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన అందె రాము(30) వడ్రంగి పని చేస్తుంటాడు. ఇతనికి ఏడాది కిందట ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన సౌందర్యతో పెండ్లి అయింది. కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో భార్య పుట్టింటికి వెళ్లింది.
ఇటీవల అత్తగారింటికి వెళ్లి భార్యను కాపురానికి రావాలని భర్త బతిమాలినా రాలేదు. దీంతో మనస్తాపం చెందిన రాము సోమవారం సాయంత్రం చింతకుంట శివారులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు మంటలు ఆర్పి కోరుట్ల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి జగిత్యాలకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
.