![పతియే దైవం అంటే ఇదే.. బావిలో పడిన భర్త.. కాపాడుకున్న భార్య](https://static.v6velugu.com/uploads/2025/02/husband-falls-into-well-after-his-wife-saves_HoeCQDaBnv.jpg)
- కేరళలోని పరవమ్లో ఘటన
కొచ్చి: బావిలో పడిపోయిన భర్తను ప్రాణాలకు తెగించి భార్య కాపాడుకుంది. సమయ స్ఫూర్తితో వ్యవహరించి అతడిని రక్షించింది. కేరళలో ఈ ఘటన జరిగింది. భార్యాభర్తలైన రమేశన్, పద్మమ్ పిరవమ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. బుధవారం ఉదయం రమేశన్ (64) తమ ఇంట్లో ఉన్న మిరియాల చెట్టుపైకి ఎక్కి మిరియాలు కోస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మ విరిగిపోయింది.
దీంతో అతడు పక్కనే ఉన్న 40 అడుగుల లోత్తైన బావిలో పడిపోయాడు. వెంటన్ స్పందించిన అతడి భార్య పద్మమ్ (56) తాడు సాయంతో బావిలోకి దిగింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రమేశన్ అప్పటికే స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. దీంతో భర్తను ఒడిసిపట్టుకొని దాదాపు20 నిమిషాలు అలాగే నీటిలో ఉంది. ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారమందించారు. స్పాట్ కు చేరుకున్న అధికారులు వల సహాయంతో వారిని బయటికి తీశారు.