
- మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలంలో ఘటన
కురవి, వెలుగు : మటన్ కూర వండలేదన్న కోపంతో ఓ వ్యక్తి భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం ఉప్పరిగూడం శివారులోని మంజాతండాలో మంగళవారం రాత్రి జరిగింది. సీరోలు ఎస్సై నగేశ్ తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన మాలోతు బాలు మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు.
మద్యం మత్తులో, మటన్ వండలేదన్న కోపంతో భార్య కళావతి (35)ని తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉంటున్న కళావతి తల్లి లక్ష్మి విషయం తెలుసుకొని వచ్చి చూసే సరికే కళావతి చనిపోయింది. వెంటనే సీరోలు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.