భార్యతో గొడవపడి కరెంట్ స్తంభం ఎక్కి దూకిన భర్త.. వీడియో

భార్యాభర్తల బంధం అనేది ఎంతో అన్యోన్యమైనది. కలకలం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటూ పెద్దలు వారిని.. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి చేస్తారు. కానీ వారు చిన్నచిన్న విషయాలకే గొడవ పడుతూ ఆ బంధానికే మాయని మచ్చ తెస్తున్నారు. సర్దుకుపోతే ఎక్కడ చులకన అవుతామో అన్న భావంతో 'నా.. నీ..' అనుకుంటూ తమ దాంపత్య జీవితాన్ని నలుగురిలోకి తెస్తున్నారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి.. తాము ఏం చేస్తున్నామన్నది మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.

తాజాగా ఓ భర్త.. భార్యతో గొడవపడి కరెంట్ స్తంభం ఎక్కారు. ఆపై కాసేపు వైర్లు పట్టుకొని వేలాడుతూ ప్రాణాలు తీసుకుంటానంటూ నానా హడావుడి చేశారు. తీరా పట్టు తప్పడంతో పై నుండి కింద పడిపోయారు. ఈ ఘటనలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.