‘మంజు చాలామందితో…. అందుకే చంపేశా’

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. అక్రమ సంబంధం కలిగి ఉందనే కారణంతో భార్య, ఆమె ప్రేమికుడు, మరియు సొంత కొడుకుని చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భిలైలో జరిగింది. చేతులు, కాళ్లు కట్టేసి.. నోటిని టేపుతో మూసి ఉన్న రెండు మృతదేహాలతో పాటు మరో నెలన్నర చిన్నారి మృతదేహం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రియుడితో కలిసి ఇంట్లో ఉన్న భార్య మంజును, ఆమె ప్రియుడిని భర్త రవి నిప్పంటించి చంపాడు. ఈ ఘటనలో మంజు, రవిల నెలన్నర కొడుకు కూడా మరణించాడు. హాల్లో మంజు మృతదేహం పక్కన మంచంపై చిన్నారి మృతదేహం ఉంది. అయితే ఆమె ప్రియుని మృతదేహం మాత్రం అత్యంత క్రూరంగా గ్యాస్ స్టౌ మీద ఉంది. వీరి ముగ్గురి చావుకు కారణమైన రవి.. ఆ ఇంటి గోడలపై ఒక మెసెజ్ కూడా రాశాడు. ‘నా సోదరుడు మంజు కోసం ఉరి వేసుకొని చనిపోయాడు. ఆమెకు చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. అందుకే నేను ఆమెను చంపాను. ఆమె కుటుంబంలోని వాళ్లను కూడా చంపుతా’ అని రాశాడు.

రవి వారిని చంపేముందు తెల్లవారుజామున 4 గంటలకు మంజు అమ్మానాన్నలకు ఫోన్ చేసి.. ‘నీ కూతురు మరియు మనవడు చనిపోతున్నారు. వీలైతే కాపాడుకోండి’ అని చెప్పాడు. వెంటనే మంజు అమ్మానాన్న తిరిగి మంజుకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. రవి మాటలకు భయపడిన వారు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మంజు ఇంటికి చేరుకునేలోపే ఘోరం జరిగిపోయింది. రవి చేసిన ఉన్మాదంలో మంజు మరియు ఆమె ప్రేమికుడు మంటలకు ఆహుతయ్యారు. కాగా.. చిన్నారి ఆ పొగలను పీల్చడం వల్ల ఊపిరాడక మృతి చెందాడు. మంజు కాల్ రికార్డింగ్ మరియు సీసీటీవీ ఫుటేజీల ద్వారా రవిని గుర్తించిన ఒడిశా రూర్కెలా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

ఇంటర్ బాలుడిపై 11 మంది విద్యార్థుల లైంగిక దాడి

చిన్నతనంలో నాపై రేప్ జరిగింది : రాహుల్ రామకృష్ణ

ప్రేమించిన అమ్మాయి ఇంటికి నిప్పు..ఇద్దరు సజీవ దహనం