
విశాఖ పట్నంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పీఎం పాలెంలో గర్భవతి భార్యను .. ఆమె భర్త అతి కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసిన ఉదంతం స్థానికులను కలచి వేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రెండేళ్ల క్రితం జ్ఞానేశ్వర్, అనూష ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో కొన్ని మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అనూష ఎనిమిదో నెల గర్భవతి ,, మరో కొద్ది గంటల్లో డెలివరీ జరగాల్సి ఉండగా.. చాలా జాగ్రత్తగా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన భర్త జ్ఞానేశ్వర్.. ఘాతుకానికి పాల్పడ్డాడు.
ALSO READ : మైనర్పై అత్యాచారం కేసు.. సిక్కింలో నలుగురు మైనర్లు సహా 8 మంది అరెస్ట్
భార్య అనూషను గొంతు పిసికి చంపిన జ్ఞానేశ్వర్ ... తన భార్య తీవ్ర అస్వస్థతకు గురైందని స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందిదని వైద్యులు ధృవీకరించారు, తరువాత అనూష మృత దేహాన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పీఎం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తుండగా మృతురాలి భర్త జ్ఞానేశ్వర్ ట్విస్ట్ ఇచ్చాడు. తన భార్య అనూషను తనే చంపానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకుండా జ్ఞానేశ్వర్ ను కఠినంగా శిక్షించాలని స్నేహితులు.. అనూష తల్లి పోలీసులను కోరుతున్నారు.