బోయిన్పల్లి లో దారుణం చోటు చేసుకుంది.పది నెలల చిన్న పాప తోపాటు భార్య చంపేశాడు ఓ భర్త. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... నాలుగు నెలల కిందట మహారాష్ట్ర నుండి వచ్చిన గణేష్, స్వప్న దంపతులు బోయిన్పల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. పిల్లాపాపలతో సాఫీగా సాగుతున్న వారి జీవితం అనుమానపు భూతం చిచ్చు పెట్టింది. అనుమానంతో భార్యతో పాటు పది నెలల పాపను కూడా చంపేశాడు గణేష్.
భార్య, కూతురును చంపినా తర్వాత గణేష్ అల్వాల్ లోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో మరో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.