బెంగళూరు:భార్య ఇన్స్టా రీల్స్కు బానిసైందనే ఆవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నాటకలోని హనూరులో చోటు చేసుకుంది. తన భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడంపై ఉన్న వ్యామోహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు భర్త కుమార్ ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టింది. వీటిపై ఇద్దరికీ తరచూ గొడవలు అవుతుండటంతో మనస్తాపం చెందిన భర్త చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
కాగా, కూలీగా పని చేస్తున్న కుమార్‌కు తన భార్య సోషల్ మీడియాలోనే ఎక్కువ సేపు గడపడంతో పాటు ఇన్ స్టాగ్రామ్ లో ఆమె తరచూ రీల్స్ చేస్తుండేది అని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె తనను పట్టించుకోవడం లేదనే బాధలో అతడు సూసైడ్ చేసుకున్నాడుని పేర్కొన్నారు. అయితే, ఘటనా స్థలం దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.