భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

భార్యను చంపిన  భర్తకు జీవిత ఖైదు

చేవెళ్ల, వెలుగు: భార్యను హత్య చేసిన భర్తకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. మోకిలా సీఐ వీరాబాబు తెలిపిన కథనం ప్రకారం...  శంకర్​ పల్లి మండలం మీర్జగూడలో ఉండే  మాణిక్యం(48) తన భార్య  యాదమ్మ(45)  ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించేవాడు. 2024 మే 5న ఆమె నిద్రించే సమయంలో తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. నిందితుడిని మే 6న  అరెస్ట్ చేసి జూలై 30న చార్జిషీటు దాఖలు చేసి రంగారెడ్డి జిల్లా కోర్టు సమర్పించారు. విచారణ చేపట్టిన జడ్జి ఎన్. శశిధర్ రెడ్డి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.