భార్యను కాల్చి చంపి భర్త సూసైడ్.. కేరళలో విషాదం

భార్యను కాల్చి చంపి భర్త సూసైడ్.. కేరళలో విషాదం

కోయంబత్తూర్: భార్యను కాల్చి చంపిన భర్త అనంతరం ఇంటికెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలోని కోయంబత్తూరులో జరిగింది. భార్యాభర్తలైన సంగీత (41), కృష్ణకుమార్ (50) కేరళలోని వందాజిలో నివసిస్తున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె విడిగా కోయంబత్తూరులో ఉంటోంది. 

సోమవారం (మార్చి 3) ఉదయం కృష్ణకుమార్ కోయంబత్తూరుకు వెళ్లి సంగీతను కలిశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపం పట్టలేక కృష్ణకుమార్ ఆమెను గన్​తో కాల్చి చంపాడు. కాల్పులు విన్న వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. 

స్పాట్​కు చేరుకున్న పోలీసులు సంగీత మృతదేహాన్ని పోస్ట్​మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, భార్యను కాల్చి చంపిన తర్వాత కేరళకు తిరిగి వచ్చిన కృష్ణకుమార్.. తన తండ్రి ముందే 
తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.