ప్రముఖ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య(Aishwarya Addala) తనను మోసం చేసిందంటూ మీడియాను ఆశ్రయించారు ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్(Pinninti Shyam Kuma). తనను పెళ్లి చేసుకొని 25 లక్షలు కాజేసి.. ఇప్పుడు విడాకులు ఇవ్వాలంటూ తనను, తన తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు శ్యామ్. అంతేకాకుండా.. ఆమె తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరారు.
ఇక పిన్నింటి శ్యామ్ కుమార్, అడ్డాల ఐశ్వర్య విషయానికి వస్తే.. వారు 2023 సెప్టెంబర్ 6న పెళ్లి చేసుకున్నారు. నటి అడ్డాల ఐశ్వర్య.. జీ తెలుగు, మా టీవీ, జెమినీ టీవీ, ఈటీవీ వంటి పలు ఛానల్లో ప్రసారమయ్యే.. పలుకే బంగారామాయేనా, అమ్మాయి గారు, అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురం వంటి సీరియల్స్ లో నటిస్తున్నారు. సీరియల్స్ లో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించారు ఐశ్వర్య. మరి భర్త శ్యామ్ కుమార్ చేసిన ఆరోపణలకు ఐశ్వర్య ఎలా స్పందిస్తారో చూడాలి.
ALSO READ :- సీల్డ్ కవర్ ఓపెన్ చేయటానికి ఏంటీ అభ్యంతరం : SBIపై సుప్రీంకోర్టు ఆగ్రహం