ఆసిఫాబాద్, వెలుగు: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో శనివారం రాత్రి ఓ భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. అడ్డు వచ్చిన మరో వ్యక్తిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలతో అతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన వడాయి మారుతితో సంగీత (26)కు 2015లో పెండ్లయ్యింది. వీరికి ఓ కొడుకు, బిడ్డ ఉన్నారు. తాగుడుకు బానిసైన మారుతి అనుమానంతో భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. దాబా గ్రామానికి చెందిన ఒకరితో సంగీతకు వివాహేతరం సంబంధం ఉందని మారుతి గొడవ చేసేవాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తాగి వచ్చిన మారుతి సంగీతతో గొడవ పడ్డాడు. ఆవేశంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో మెడ పై నరికాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. గొడవ జరుగుతున్న విషయం తెలుసుకుని సముదాయించేందుకు మొర్లె పొచ్చు అనే వ్యక్తి అడ్డు రాగా అతడిపై కూడా గొడ్డలితో దాడి చేశారు. మెడ పై, ఎడమ చేతిపై నరకగా అతడు తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల వారు అతడిని హాస్పిటల్కు తరలించారు. మృతురాలి తండ్రి లెండిగురే బాబాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు.
అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త
- ఆదిలాబాద్
- May 8, 2023
లేటెస్ట్
- ప్రతి ఒక్కరు చదువుకోవాలనేది కాకా తపన : సరోజా వివేక్
- మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు: శ్రేయా చౌదరి
- మెదక్ చర్చి @100 ఏళ్లు..శతవసంతాల వేడుక.. ఎన్నెన్నో విశేషాలు...
- ఉగాండాను వణికిస్తున్న డింగాడింగా వైరస్..లక్షణాలివే..
- గుర్లపల్లిలో అగ్నిప్రమాదం
- 74 ఏండ్ల వయసులో గుడ్డుపెట్టిన పక్షి
- అంబేడ్కర్ ఇన్ స్టిట్యూట్ లో ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు
- జిల్లాను టాప్ లో నిలబెట్టాలి
- నింగిలో డ్రోన్లు చేసిన అద్భుతం!
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్స్వీనీ ఆవేదన
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...
- సినిమాలు తీసుకోండి.. సంపాదించుకోండి.. చట్టాన్ని అతిక్రమిస్తే తాటతీస్తా : సినిమా వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
- శ్రీతేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్కు
- నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది : అల్లు అర్జున్