సెల్ ఫోన్ రిపేర్కు భార్య డబ్బులివ్వలేదని గడ్డి మందు తాగాడు

సెల్ ఫోన్ రిపేర్కు భార్య డబ్బులివ్వలేదని గడ్డి మందు తాగాడు
  • గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
  • సంగారెడ్డి జిల్లా తాలెల్మలో ఘటన

జోగిపేట, వెలుగు: సెల్​ఫోన్​ రిపేర్​చేయించుకునేందుకు డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో  గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం తాలెల్మ  గ్రామానికి చెందిన వి.భాగయ్య(40) సెల్​ఫోన్​ రిపేర్​చేయించుకునేందుకు భార్యను రూ.3వేలు అడిగితే ఇవ్వలేదు. దీంతో అతను మద్యం మత్తులో భార్యతో గొడపడి గడ్డి మందు తాగాడు. వెంటనే జోగిపేట  ఆస్పత్రికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.   కేసు నమోదు చేసినట్లు జోగిపేట ఎస్ఐ పాండు తెలిపారు.