భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్

ఆదిలాబాద్: వాట్సాప్ మేసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అబ్దుల్ అతీక్ (32) తన మొదటి భార్య జాస్మిన్ కు ట్రిపుల్ తలాక్ చెప్పడంలో అతనిపై కేసే నమోదు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో జాస్మిన్ ను అబ్దుల్ అతీక్ పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అయితే గత కొంతకాలంగా వారి మధ్య గొడవలజరిగి వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో అబ్దుల్ అతీక్ రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో 2023లో జాస్మాన్ అతనిపై కేసు పెట్టింది. 

దీంతోపాటు జాస్మిన్ మెయింటెనెన్స్ కోసం కోర్టును ఆశ్రయించింది. అతీక్ అతని కుమార్తెల పోషణకు నెలకు రూ.7,200 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే అతీక్ ఈ కోర్టు ఆర్డర్ ను పాటించడంలో విఫలమయ్యాడు. దీంతో జాస్మిన్ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో మరోసారి అతీక్ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో జాస్మిన్ పై కోపంతో ట్రిపుల్ తలాక్ అంటూ వాట్సాప్ ద్వారా వాయిస్ మేసేజ్ పంపాడు. జాస్మిన్ ఈ మేసేజ్ ను ఇరు కుటుంబాల బంధువులకు చూపింది. చట్టపరమైన ఫిర్యాదు చేయమని వారు సలహా ఇచ్చారు. 

తక్షణ ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధం

మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం ట్రిపుల్ తలాక్'ద్వారా తక్షణ విడాకుల పద్ధతిని నేరంగా పరిగణించింది. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఎస్ ఐ శ్రీనివాస్ తెలిపారు. అదిలాబాద్ లో ఇదే మొదటి కేసు అని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నవీ ముంబైకి చెందిన 43 ఏళ్ల వ్యక్తికి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం , 2019 కింద కేసు నమోదు చేశారు.  అయితే ఇంకా అరెస్టులు జరగలేదు.