డబ్బుల విషయంలో గొడవ... భార్యను హత్య చేసిన భర్త

డబ్బుల విషయంలో గొడవ... భార్యను హత్య చేసిన భర్త
  • కామారెడ్డి జిల్లా మహమ్మద్‌‌‌‌ నగర్‌‌‌‌ మండలంలో దారుణం

మహమ్మద్‌‌‌‌నగర్‌‌‌‌ (ఎల్లారెడ్డి), వెలుగు : డబ్బుల విషయంలో భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఆవేశంలో ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్‌‌‌‌నగర్‌‌‌‌ మండలం అవుసులతండాలో బుధవారం జరిగింది. ఎస్సై శివకుమార్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన షేర్యా, అతడి భార్య మోతిబాయి (55) కూలి పనులు చేసుకొని జీవిస్తున్నారు.

 తాగుడుకు బానిసైన షేర్యా డబ్బుల విషయంలో తరచూ మోతిబాయితో గొడవ పడేవాడు. బుధవారం కూడా మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన షేర్యా కత్తితో మోతిబాయి మెడ మీద నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత షేర్యా ఇంటికి తాళం వేసి నిజాంసాగర్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.