వాషింగ్టన్: హష్ మనీ కేసులో దోషిగా తేలినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ శిక్ష తప్పించుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌కు శిక్ష విధించినా ప్రయోజనం ఉండదనే మన్హటన్ జడ్జి భావించారు.
దీంతో ట్రంప్ను అన్ కండిషనల్ డిశ్చార్జ్ చేస్తూ మన్ హటన్ కోర్టు జడ్జి హువాన్ మర్చన్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో అంతకుముందు న్యూయార్క్ కోర్టు ట్రంప్ను దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది.
ఆయనకు శిక్ష పడాల్సి ఉండగా.. న్యూయార్క్ కోర్టు తీర్పును మాన్ హటన్ కోర్టులో ఆయన సవాల్ చేశారు. శుక్రవారం ఈ కేసుపై మాన్ హటన్ కోర్టు జడ్జి హువాన్ మర్చన్ విచారణ జరిపారు. తన అడ్వొకేట్ తో కలిసి ట్రంప్ ఆన్ లైన్లో విచారణకు హాజరయ్యారు.
తాను ఏ తప్పూ చేయలేదని జడ్జి ఎదుట ట్రంప్ చెప్పారు. హష్ మనీ కేసులో ట్రంప్ ఎలాంటి జైలుశిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని, జరిమానా కట్టాల్సినఅవసరం కూడా లేదని జడ్జి తెలిపారు. కాగా, దోషిగా నిర్ధారణ అయిన మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు.