
బెజ్జంకి, వెలుగు : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్, వడ్లూరు గ్రామాల్లో గత మంగళవారం కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను హుస్నాబాద్ ఏడీఏ మహేశ్ శనివారం పరిశీలించారు.
మండలంలో 33 శాతం పంట నష్టం జరిగిందని నష్టపోయిన ప్రతి రైతు పేరును నమోదు చేసి జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఏవో సంతోష్, ఆత్మ అధికారి సాయి చరణ్, ఏఈవో సాయి శంకర్, రైతులు పాల్గొన్నారు.