హుస్నాబాద్ లో నాటుబాంబు కలకలం

  • పేలిన నాటుబాంబు

  • యువకుడికి తీవ్రగాయాలు

హుస్నాబాద్/ సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో నాటు బాంబు పేలి యువకుడికి తీవ్ర గాయాలవడం కలకలం రేపింది. మీర్జాపూర్ గ్రామానికి చెందిన ఖలీల్ తన పశువులను మేపేందుకు పొలం వద్దకు తీసుకెళ్లాడు. వాటిని తాళ్లతో కట్టేసి ఉంచేందుకు భూమిలోకి మేకు కొడుతుండగా నాటుబాంబు పేలినట్లు స్థానికులు తెలిపారు. ఈఘటనలో ఖలీల్ చేతితో పాటు కాలుకు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని  వరంగల్ ఎంజీఎంకి తరలించారు. అయితే ఈ నాటు బాంబులు అడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.