
హుస్నాబాద్, వెలుగు : కాంగ్రెస్, బీజేపీకి సీఎం అభ్యర్థులే లేరని బీఆర్ఎస్ హుస్నాబాద్అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలోని ఎల్కతుర్తితోపాటు మండలంలోని దండేపల్లి, పోలాడిపల్లి, కేశవాపూర్, భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీల సీఎం అభ్యర్థులు ఎవరో చెప్పాలన్నారు.
అవి లీడర్, క్యాడర్ లేని ఎలక్షన్ టూరిస్ట్ పార్టీలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలో హైకమాండ్ ఢిల్లీలో ఉంటే, బీఆర్ఎస్ హైకమాండ్ తెలంగాణ గల్లీలో ఉందన్నారు. ఇక్కడి ప్రజలు స్వచ్ఛమైన మనసున్నవారని, వారికి అన్ని విషయాలు తెలుసని, బీఆర్ఎస్కే ఓటువేయాలని ఎప్పుడో డిసైడ్అయ్యారన్నారు. సతీశ్కుమార్తోపాటు ఆయన తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, కొడుకు ఇంద్రనీల్, అల్లుడు అనురాగ్, చిన్నమ్మ చాకుంట రమాదేవి.. సైదాపూర్ మండలం అమ్మనగుర్తి, బొమ్మకల్, ఎక్లాస్ పూర్, దుద్దెనపల్లి, భీమదేవరపల్లి మండలం రసూల్ పల్లి, ధర్మారం, కొత్తకొండ, ముస్తఫాపూర్, గట్లనర్సింగాపూర్, వంగర, రంగయ్యపల్లి, పీవీ నగర్, హుస్నాబాద్ మండలం పొట్లపల్లి, పందిల్ల, మహ్మదాపూర్, గోవర్ధనగిరి, గౌరవెల్లి, అక్కన్నపేట మండలం అంతకపేట, కోహెడ మండలం తంగళ్లపల్లి, శనిగరంలో ప్రచారం చేశారు.