
ఎల్కతుర్తి, వెలుగు : కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం జరుగుతుందని హుస్నాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్ పొన్నం ప్రభాకర్ చెప్పారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో సోమవారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి బీఆర్‌ఎస్ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. దండేపల్లికి రోడ్డు వేయకుండా ఊర్లో అడుగు పెట్టబోనని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు ఆ ఊరికి ఎలా వస్తారని ప్రశ్నించారు. పీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మాజీ అధ్యక్షుడు సుకినె సంతాజీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్, బీసీ సెల్ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్ పాల్గొన్నారు.