తెలంగాణలో రానున్నది కాంగ్రెస్​ ప్రభుత్వమే : పొన్నం ప్రభాకర్

​సైదాపూర్​, వెలుగు : తెలంగాణలో రానున్నది ప్రభుత్వం కాంగ్రెస్​ ప్రభుత్వమే అని హుస్నాబాద్ కాంగ్రెస్​ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​ అన్నారు. గురువారం ఆయన సైదాపూర్ మండల కేంద్రంతో పాటు ఆకునూరు, రాయికల్, బొమ్మకల్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండుసార్లు హుస్నాబాద్​లో గెలిచిన ఎమ్మెల్యే అధికార పార్టీ అయినప్పటికీ అభివృద్ధి చేయాలేదని విమర్శించారు.

సబ్బండ వర్గాలు పోరాడితే వచ్చిన తెలంగాణలో కేవలం ఒక్క కుటుంబం భోగాలు అనుభవిస్తోందన్నారు.  ఈసారి హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్​ ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయనవెంట పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, సీనియర్​ నాయకులు గుండారపు శ్రీనివాస్​, ఊసకోయిల రాఘవులు ఉన్నారు. 

ALSO READ : మాజీ ఎంపీ వివేక్ ‌‌చేరికతో కాంగ్రెస్ ‌‌ ‌‌కు బలం : బొంతల రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్