వేములవాడ, వెలుగు : మంత్రి పదవి చేపట్టిన హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ చేసిన పోరాటం వెలకట్టలేనిదన్నారు. రాష్ట్రంతోపాటు వేములవాడ నియోజకవర్గం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ALSO READ:యష్ కొత్త సినిమా టాక్సిక్.. అదిరిపోయిన టైటిల్ వీడియో
ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం వేములవాడ చేరుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు అభినందనలు పలువురు అభినందనలు తెలిపారు. గురువారం వేములవాడ చేరుకున్న ఆయనను పలువురు కలిసి శాలువాలతో సత్కరించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు కొత్త అనిల్, కటకం కిషన్, వేములవాడ, కథలాపూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్ లీడర్లు, ప్రజా ప్రతినిధులు ఆయనను సత్కరించారు.