
- హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిత
హుస్నాబాద్, వెలుగు : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజాపాలనను సక్సెస్ చేయాలని హుస్నాబాద్ మున్సిపల్చైర్పర్సన్ఆకుల రజిత సూచించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు కోసం గురువారం నుంచి నిర్వహించబోయే ప్రజాపాలనపై బుధవారం కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దరఖాస్తుదారులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అర్హులైనవారందరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. దరఖాస్తు ఫారాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వీకరిస్తారని, తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తీసుకుంటారన్నారు. పట్టణంలోని 20 వార్డుల్లో దరఖాస్తులు తీసుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.