హోటల్స్​ క్లీన్​గా ఉండాలె : ఆకుల రజిత

హుస్నాబాద్, వెలుగు : ఇంటిని ఎలాగైతే క్లీన్​గా ఉంచుకుంటామో హోటల్స్​ను కూడా అలాగే ఉంచాలని హుస్నాబాద్​ మున్సిపల్​ చైర్​పర్సన్​ ఆకుల రజిత అన్నారు. శుక్రవారం స్వచ్ఛతహీ సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో పారిశుధ్యం, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హోటళ్లలోని కిచెన్​, స్టోర్​ రూములు,  హాల్స్​ క్లీన్​గా ఉండాలని నిర్వాహకులకు సూచించారు.

 ప్లాస్టిక్​ కవర్లలో పార్సల్ చేయొద్దని, టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్​ వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, కౌన్సిలర్ స్వర్ణలత, శానిటరీ ఇన్​స్పెక్టర్​బాల ఎల్లమ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రవికుమార్, జవాన్లు సారయ్య , ప్రభాకర్ పాల్గొన్నారు.