మహబూబాబాద్ అర్బన్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ ఆరోపించారు. మంగళవారం పల్లె పల్లె బీజేపీ.. ఇంటింటికి హుస్సేన్ నాయక్’ ప్రజా ఆశీర్వాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.
Also Read :- సమస్యలు పట్టని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
మున్సిపాలిటీలోని సాంక్రియతండా, మంగలికాలనీ, వినాయకకాలనీ, పత్తిపాక, బాబునాయక్‌తండా డాక్టర్స్స్ట్రీట్, మార్వడీబజార్, రెడ్డిబజార్లలో ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. బీజేపీ లీడర్ల శశివర్ధన్‌రెడ్డి, సిద్ధార్ధ్‌రెడ్డి, శ్యాంసుందర్‌శర్మ తదితరులు ఉన్నారు.