బీఆర్‌‌ఎస్‌‌ ఓటమే లక్ష్యంగా పని చేయాలి: హుస్సేన్‌‌ నాయక్‌‌

గూడూరు, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ మానుకోట క్యాండిడేట్‌‌ హుస్సేన్‌‌ నాయక్‌‌ పిలుపునిచ్చారు. మహబుబాబాద్‌‌ జిల్లా గూడూరు మండలంలోని బ్రాహ్మణపల్లి, సర్వతీనగర్, మర్రిమిట్ట గ్రామాల్లో గురువారం ప్రచారం చేశారు.

స్థానికుడినైన తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే వచ్చానన్నారు. అనంతరం మర్రిమిట్ట ఎంపీటీసీ వాంకుడోతు విజయ, బ్రాహ్మణపల్లి వార్డు మెంబర్‌‌తో పాటు పలువురు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో సురేందర్‌‌, ధర్మారెడ్డి, వెంకన్న, రాంబాబు, రాజు, శ్రీశైలం పాల్గొన్నారు.

ALSO READ: OTTలో ఆర్య హారర్ వెబ్ సిరీస్.. ఆ విలేజ్లో ఎం జరిగిందంటే