హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్లోనీటి మట్టం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాగర్నిండిపోయింది. ప్రస్తుతం దాని నీటి మట్టం 513.62కిచేరుకుంది. వచ్చిన నీటిని యథావిధంగా కిందికి వదులుతున్నారు. ఇందుకోసం అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు సాగర్‌నీటి స్థాయిలను పరిశీలించారు.
గేట్లు మొత్తం తెరిచే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు ముంపునకు గురి కాకుండా ఉండేందుకు అధికారలు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 428 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లను యాక్టివ్ చేసింది. వీటితో పాటు 27 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను వాటర్‌లాగింగ్ పాయింట్ల వద్ద మోహరించారు.
ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 14ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవికిరణ్, లేక్ సీఈ సురేష్ కుమార్ పరిశీలించారు. సహాయక చర్యలు పర్యవేక్షించారు.