కౌశిక్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదు : గెల్లు రాజేందర్ యాదవ్

హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని, ఆయనకు రక్షణ కల్పించాలని కోరుతున్నాడు గెల్లు రాజేందర్ యాదవ్ అనే వ్యక్తి. కరీంనగర్ కలెక్టరేట్ లో ఎన్నికల అధికారికి హుజురాబాద్ కు చెందిన గెల్లు రాజేందర్ ఫిర్యాదు చేశాడు. కౌశిక్ రెడ్డి డిప్రెషన్ లో‌ ఉన్నాడని, అతని మానసిక‌ స్థితి బాగో లేదంటున్నాడు.

మానసిక స్థితి‌ బాగలేకనే తన భార్య, కూతురుతో సహా తాను కూడా చనిపోతామని కౌశిక్ రెడ్డి చెప్పాడని ఎన్నికల అధికారికి వివరించాడు గెల్లు రాజేందర్. ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడే వరకు కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరాడు. కౌశిక్ రెడ్డికి మానసిక వైద్య పరీక్షలు చేయించాలని సూచించాడు. కౌశిక్ రెడ్డితో పాటు అతని‌ కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతే ఎన్నికల‌ అధికారులదేనని చెప్పాడు.