పిడికెడు నాయకులు ప్రలోభాలకు గురవుతారు కానీ ప్రజలు కారని ఈటల అన్నారు. కేసీఆర్ అందర్నీ కొనుగోలు చేసి కోవర్టుగా చేసుకుంటున్నరని ఈటల అన్నారు. ప్రేమాభిమానం ముందు డబ్బులు, మద్యం పని చేయవన్నారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటే మంచికి సంకేతమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ నిశ్చేష్టం అయ్యిందని.. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాలని ఈటల అన్నారు. సాయంత్రానికల్లా 90 శాతం పోలింగ్ అవుతుందనుకుంటున్నానని ఈటల అన్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఒకవైపు ఉంటే.. ప్రజలంతా మరోవైపు ఉన్నారని ఈటల జమున అన్నారు.