హుజురాబాద్‌ రిజల్ట్.. వీ6 లైవ్​లో లక్ష మందికి పైనే

హుజూరాబాద్ రిజల్ట్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి జనం ఆసక్తి చూపారు. నాన్ స్టాప్ గా అప్డేట్స్ అందిస్తున్న వీ6 న్యూస్ చానల్ ను తెలంగాణతో పాటు ఏపీ, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని తెలుగు వాళ్లు ఉత్కంఠగా చూశారు. ఇండ్లు, షాపులు, హోటళ్లలో ఎక్కడ చూసినా వీ6 చానల్ పెట్టి రిజల్ట్స్ తెలుసుకున్నారు. పోలీసులతో పాటు రకరకాల పనుల్లో ఉండి టీవీ అందుబాటులో లేని వాళ్లు మొబైల్​లో లైవ్ టీవీని ఫాలో అయ్యారు. ఆఫీసుల్లో ఉండేవాళ్లు కంప్యూటర్లలో యూట్యూబ్ లైవ్ చానల్​ను చూశారు. మొత్తంగా రోజంతా కోట్ల మంది వీ6ను చూస్తూ బై పోల్ అప్డేట్స్ కు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలుసుకున్నారు. వీ6 యూట్యూబ్ లైవ్ చానల్​ను ఒకేసారి లక్ష మందికి పైగా ఫాలో కావడం విశేషం. రోజంతా యూట్యూబ్ చానల్ నే 60 లక్షల మందికి పైగా ఫాలో అయ్యారు. వెబ్​సైట్, ఫేస్​బుక్, ఇతర సోషల్ ప్లాట్​ఫామ్​లు అన్నీ కలిపి కోటి మందికి పైగా ఆన్​లైన్ లోనే అప్​డేట్స్ తెలుసుకున్నారు. హుజూరాబాద్ రిజల్ట్ పై జనం ఇంట్రస్ట్​కు ఇదే నిదర్శనం.  బైపోల్​సమాచారాన్ని ఆపకుండా అందించడంతో పాటు కచ్చితమైన ఇన్ఫర్మేషన్​ను నిష్పక్షపాతంగా, సూటిగా అందించడంతో వీ6ను కోట్ల మంది ఆదరించారు. వీ6 విశ్వసనీయతకు ఇది మరోసారి అద్దం పట్టింది.