హుజూరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి హల్‌చల్ చేస్తున్నారు. తాను పోలింగ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అని చెప్పుకొని అన్ని పోలింగ్ కేంద్రాలలో తిరుగుతున్నాడు. తన అనుచరులతో గుంపుగా వచ్చి అడ్డుకున్నవారిని తిడుతూ.. టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే గన్ముక్లలో ఆయనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తాజాగా వీణవంక మండల కేంద్రంలోని హైస్కూల్ లో కూడా ఆయనను అడ్డుకున్నారు. ఎలక్షన్ ఏజెంట్ అయితే ప్రచారం ఎందుకు చేస్తున్నావంటూ బీజేపీ నేతలు నిలదీస్తున్నారు.
- కౌశిక్ ను తరిమిన గ్రామస్తులు
వీణవంక మండలం గన్ముక్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ తీరును పరిశీలించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు. ఓటర్లంతా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి బయటి వరకు తరిమారు. పోలింగ్ సెంటర్కు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారు. దాంతో కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు.