జమ్మికుంట, వెలుగు : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని, 30న జరగనున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఓటేసి తమను గెలిపించాలని హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ కోరారు. ఆదివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని తుమ్మేటి సమ్మిరెడ్డి నివాసంలో జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన ఇతర పార్టీలకు చెందిన సుమారు 200మంది నాయకులు, కార్యకర్తలు ప్రణవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
అనంతరం జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒక తాను ముక్కలేనని, 10 ఏండ్లుగా ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను ప్రతి గడపగడపకు అందిస్తామన్నారు. మహిళా సంక్షేమం కోసం మేనిఫెస్టోలో అనేక పథకాలు ప్రకటించిందన్నారు. లీడర్లు సుంకరి రమేశ్, కసుబోజల వెంకన్న, ఎండీ సలీం, ఎగ్గిని శ్రీనివాస్ , హుస్సేన్, కార్యకర్తలు పాల్గొన్నారు .