హుజూరాబాద్‌‌‌‌లో జర్నలిస్టుల రాస్తారోకో 

 హుజూరాబాద్‌‌‌‌లో జర్నలిస్టుల రాస్తారోకో 

హుజూరాబాద్, వెలుగు: ‘మా ఇల్లు మాకు కావాలంటూ’ హుజూరాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన ఉధృతమయింది.  గురువారం జర్నలిస్టులతో పాటు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల లీడర్లు ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌ నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు.  అనంతరం రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ  గత ప్రభుత్వంలో కేటాయించిన స్థలాల్లో జర్నలిస్టులు రూ.లక్షలు వెచ్చించి ఇండ్లు కట్టుకున్నారని, వాటిని వెంటనే పూర్తిస్థాయిలో వారికే కేటాయించేలా మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి ప్రణవ్ చొరవ తీసుకోవాలని కోరారు. జమ్మికుంట రోడ్డులోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు.    ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనన్లు కాయిత రాములు, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సూద్ పాల్గొన్నారు.