హుజూరాబాద్ రూరల్, వెలుగు : హుజూరాబాద్ మండలం జూపాకలో ఇటీవల నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ జాతర ఆదాయం రూ.5,53,855 వచ్చినట్లు దేవాదాయశాఖ ఈవో సుధాకర్, జాతర కమిటీ చైర్మన్ సదానందం తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగిన జాతరలో ఏర్పాటు చేసిన హుండీలను
ఇతర కానుకలను శుక్రవారం జీపీ ఆఫీసులో లెక్కించారు. టికెట్ల ద్వారా రూ. 71 వేలు, వేలం ద్వారా రూ.72వేలు, హుండీల ద్వారా రూ.4లక్షల 855 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు, మాజీ చైర్మన్లు రాజిరెడ్డి, నిరంజన్ రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.