- హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
కరీంనగర్, వెలుగు : అధికారిక మీటింగ్‌కు పిలిచి తనపై కేసులు పెడతారా ? అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా రేవంత్‌రెడ్డికి భయపడేది లేదని, ప్రశ్నిస్తున్నందుకే తనపై, బీఆర్‌ఎస్ లీడర్లపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో గురువారం కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రోజుకొకరిపై కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు లేదా ? అని ప్రశ్నించారు.
టెస్లా కంపెనీని హైదరాబాద్ తీసుకురావడానికి కేటీఆర్ రేసు నడిపారని, దీంతో ప్రభుత్వానికి రూ. 700 కోట్ల లాభం వచ్చిందన్నారు. మీటింగ్‌లో ముందు సంజయే తనపై దాడి చేశారన్నారు. కరీంనగర్ ఆర్డీవో ఎవరో కూడా తనకు తెలియదని, తాను ఆర్డీవోను ఏం అనకపోయినా ఆయనతో కేసు పెట్టించారన్నారు. ‘గతంలో డీకే అరుణను రివ్యూ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి తిట్టలేదా ? నువ్వు చేస్తే సంసారం, నేను చేస్తే వ్యభిచారమా.. ఈ రోజు దాడులు మేము చేస్తున్నామా ? మీరు చేస్తున్నారా ? ఖమ్మంలో హరీశ్‌రావుపై రాళ్లతో దాడి చేయించింది నువ్వు కదా రేవంత్‌రెడ్డి’ అని ప్రశ్నించారు.