కరీంనగర్: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు హుజూరాబాద్ పోలీసులు. అనుమతి లేకుండా హుజూరాబాద్ లో దళితబంధు లబ్దిదారులతో కలిసి ధర్నాలో చేసినట్లు ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
నవంబర్ 9న ముందస్తు అనుమతి లేకుండా ..దళిత బంధు లబ్దిదారులతో కలిసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ లో ఆందోళన నిర్వహించినట్లు పోలీసులు ఆరోపించారు. అధికార యంత్రాంగం అనుమతి లేకుండా రోడ్డుపై అక్రమంగా గుమికూడటం, దళిత బంధు పథకం లబ్దిదారులతో ధర్నా చేయడం, తెలిసి కూడా విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం వంటి ఆరోపణలతో కేసు పెట్టారు
ధర్నా, ఆందోళనను విరమించుకోవాలని పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అభ్యర్థించినా తిరస్కరించారని చెప్పారు. పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడంతోపాటు , పోలీసులను నీచ పదజాతంలో తిట్టారని, చేతులతో నెట్టారని ఆరోపించారు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితోపాటు పలువురిపై బీఎన్ ఎస్ యాక్టు "358/2024 U/s 223, 126(2), 221, 189(2) r/w 190,
"359/2024 U/s 223, 132, 126(2), 192, 189(2), 189(3)r/w 190 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులను సంఘటన జరిగిన రోజు నవంబర్ 9న నమోదు చేశారు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.