
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన డ్రైవర్ ఠాకూర్ రమేష్ సింగ్ గుండెపోటుతో మృతి చెందాడు. బస్సులో హుజురాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా గజ్వేల్ దగ్గరకు రాగానే ఛాతిలో నొప్పిగా ఉందని బస్సు పక్కకు ఆపాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలో డ్రైవర్ రమేష్ సింగ్ మృతి చెందాడు. బస్సులో ఉన్న 45 మంది ప్రాణాలు కాపాడి చనిపోయాడు డ్రైవర్ రమేష్ సింగ్.