ఈటల లేని పార్టీ తండ్రి లేని కుటుంబంలా మారింది

కరీంనగర్: ఈటల రాజేందర్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో హుజురాబాద్ టీఆర్ఎస్ తండ్రి లేని కుటుంబంలా మారిందని స్థానిక ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. జమ్మికుంటలో హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలపై చర్చించుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో వచ్చి పదవులు పొందిన వాళ్ళు.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఉపఎన్నికలో పోటీచేసిన గెల్లు శ్రీనివాస్‎ది ఒక వర్గం, కౌశిక్ రెడ్డిది మరో వర్గంగా పార్టీ తయారయిందంటూ ఆరోపించారు. ఈటల రాజేందర్ పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత తండ్రి లేని కుటుంబంలాగా పార్టీ మారిందని ఆవేదనకు లోనయ్యారు. వందల కోట్లు ఖర్చు పెట్టినా పార్టీ ఎందుకు గెలవ లేకపోయిందని కనీసం పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదన్నారు. 2001 నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళు కొందరుంటే,  మధ్యలో కండువా కప్పు కొని పదవులు పొందిన వాళ్ళు మరికొందరున్నారు. 2001 నుంచి ఈటల రాజేందర్ వెళ్ళిపోయే వరకు పార్టీలో అందరూ ఒకతాటిపై నడిచారని నేతలు అభిప్రాయపడ్డారు. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతుంటే.. పార్టీని బలోపేతం చేసే నాయకుడు కరువయ్యాడని అసంతృప్తి చెందారు.

For More News..

వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన కోదండరాం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

మూడు నెలల చిన్నారిని ఏడుసార్లు అమ్మిన్రు