ఎన్నికల్లో ప్రత్యర్థులకే సపోర్ట్​ చేసిన్రు: సైదిరెడ్డి మాట్లాడిన ఆడియో వైరల్

సూర్యాపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల టైంలో పార్టీ డబ్బులు ఇవ్వకున్నా సొంత పైసలు ఖర్చు పెట్టుకున్నానని, ప్రత్యర్థులకు డబ్బులు ఇచ్చి సపోర్ట్​ చేశారని రెండు రోజుల క్రితం బీఆర్​ఎస్​నుంచి బీజేపీలో చేరిన హూజూర్​నగర్​మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులతో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​అవుతున్నాయి. ఆ ఆడియోలో సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ 10 నుంచి 12 ఎంపీ సీట్లను బీజేపీ గెలుస్తుందన్నారు. 

బీఆర్ఎస్ లో పోటీ అంటేనే నేతలు భయపడి పోతున్నారని...ఆర్థిక బలం ఉన్న రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి కూడా వెనకడుగు వేశారన్నారు. ‘ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు పిలిచి నల్గొండ ఎంపీ టికెట్ నాకే ఇస్తాం అన్నారు. ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకొకుంటే పార్టీ పరువు పోతుంది’ అని అన్నారు. సీఎం రేవంత్​ను  దింపాలని కాంగ్రెస్ ​వాళ్లే చూస్తున్నారని, ఆ వ్యతిరేక బ్యాచ్ కు బీఆర్ఎస్ నేతలే మద్దతు ఇస్తారని..ఈ కుట్రలు, కుతంత్రాలు మనకు అవసరమా? అని అన్నారు.