
- సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఘటన
హుజూర్‌నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. యువతిపై ఆమె స్నేహితురాలి లవర్ అత్యాచారం చేయగా, ఇందుకు ఫ్రెండ్ సైతం సహకరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువుకు చెందిన ఓ యువతి (26), హుజూర్‌నగ్‌కు చెందిన నిమ్మల రోజా ఫ్రెండ్స్. వారం కింద రోజా తన ఫ్రెండ్‌కు ఫోన్ చేసి తన ఇంటికి రావాలని కోరింది. యువతి రావడంతో ఆమెకు మద్యం తాగించారు. మత్తులోకి వెళ్లిన తర్వాత రోజా లవర్ ప్రమోద్‌కుమార్ యువతిపై అత్యాచారం చేయగా రోజా వీడియో తీసింది.
బుధవారం మరోసారి రోజా బాధిత యువతికి ఫోన్ చేసి హుజూర్‌నగర్‌కు రావాలని చెప్పింది. హుజూర్‌నగర్‌కు వచ్చాక రోజా, ప్రమోద్‌కుమార్ కలిసి కారులో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద గల నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక ప్రమోద్‌కుమార్ తన ఫ్రెండ్ హరీశ్ కోరిక తీర్చాలని యువతిని బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో రోజా, ప్రమోద్‌కుమార్, హరీశ్ కలిసి యువతిపై దాడి చేశారు.
తర్వాత కారులో తమ ఇంటికి తీసుకెళ్లి విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. అక్కడి నుంచి వెళ్లిన బాధిత యువతి విషయాన్ని తన బంధువులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోజా, ప్రమోద్‌కుమార్, హరీశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.