కమ్యూనిటీ హాల్​నిర్మాణానికి కృషి చేయాలి : మంత్రి ఉత్తమ్

కమ్యూనిటీ హాల్​నిర్మాణానికి కృషి చేయాలి : మంత్రి ఉత్తమ్

హుజూర్ నగర్, వెలుగు : టీచర్స్ కాలనీలో కమ్యూనిటీ హాల్​నిర్మాణానికి కృషి చేయాలని కాలనీవాసులు కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్​లో మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డిని హుజూర్ నగర్ టీచర్స్ కాలనీ డెవలప్ మెంట్ సభ్యులు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్​నగర్​లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ కాలనీ 300 కుటుంబాలతో ఏర్పడిందని తెలిపారు. 

ఈ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీచర్స్ కాలనీ డెవలప్ మెంట్ అధ్యక్ష, కార్యదర్శులు తాటి ప్రభాకర్ రెడ్డి, ఎంఎస్ఎన్ రాజు, ఈడుపుగంటి సుబ్బారావు, బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.