హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ 3వ ఎడిష‌‌‌‌న్‌‌‌‌ సక్సెస్‌‌‌‌

హైద‌‌‌‌రాబాద్, వెలుగు: ఫుడ్ అవార్డ్స్ 3వ ఎడిష‌‌‌‌న్‌‌‌‌ను హైబిజ్‌‌‌‌ విజ‌‌‌‌య‌‌‌‌వంతంగా నిర్వహించింది. ఈ ఈవెంట్‌‌‌‌కు రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌‌‌‌ర్ గ‌‌‌‌డ్డం ప్రసాద్ కుమార్  ముఖ్య అతిథిగా హాజ‌‌‌‌ర‌‌‌‌య్యారు. సినీ నటి ఫరియా అబ్దుల్లా, మిస్ యూనివ‌‌‌‌ర్స్ తెలంగాణ నిహారికా సూద్, మిస్ గ్రాండ్ ఇండియా 2022 ప్రాచీ నాగ్ పాల్ ఇందులో పాల్గొని సంద‌‌‌‌డి చేశారు. హైబిజ్ టీవీ ఇప్పటికే మీడియా, ఉమెన్ లీడర్ షిప్, హెల్త్ కేర్, రియ‌‌‌‌ల్టీ, ఎడ్యుకేష‌‌‌‌న్ అవార్డ్స్ ను విజ‌‌‌‌య‌‌‌‌వంతంగా నిర్వహించింది. ఆహార ప‌‌‌‌రిశ్రమ‌‌‌‌లోని ప్రొఫెష‌‌‌‌న‌‌‌‌ల్స్‌‌‌‌ను ప్రోత్సహించేందుకు తాజాగా మూడో ఎడిషన్‌‌‌‌ అవార్డ్స్‌‌‌‌ను  నిర్వహించింది.