హైదరాబాద్, వెలుగు: చేపలకు ఫుడ్ తయారు చేసే గ్రోవెల్ గ్రూప్ పెట్ ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. డాగ్స్ కోసం రెండు ఫుడ్ బ్రాండ్లను లాంచ్ చేసింది. ఫులర్, దట్ గుడ్ పేర్లతో వీటిని మార్కెట్లోకి తెచ్చింది. వీటిలో ఫులర్ ప్రీమియం బ్రాండ్ కాగా, దట్‌గుడ్ ప్యాకెట్ ధర రూ.100 నుంచి మొదలవుతోంది. త్వరలో పిల్లుల కోసం కూడా ప్రొడక్ట్‌లు తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది.
పెట్ ఫుడ్ బిజినెస్ నుంచి ఈ ఏడాది రూ. 3 కోట్ల వరకు రెవెన్యూ రావొచ్చని గ్రోవెల్ గ్రూప్ పెట్ ఫుడ్ బిజినెస్ హెడ్ జేఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. రానున్న 5–7 ఏళ్లలో రూ.80–100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని అన్నారు. దేశంలోని 200 సిటీల్లో 1,800 ఔట్‌లెట్లను ఆపరేట్ చేస్తున్నామని వివరించారు. రొయ్యలు ఎగుమతులు, ఆక్వా న్యూట్రిషన్స్, ఫుడ్ వంటి వివిధ బిజినెస్‌లలో ఉన్న గ్రోవెల్ గ్రూప్ కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.2 వేల కోట్ల రెవెన్యూ సాధించామని చెబుతోంది.