
హైదరాబాద్, వెలుగు; ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ (ఐఎస్‌ఎస్‌ఓ) నేషనల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ హైదరాబాద్‌లో శనివారం మొదలైంది. శేరిలింగంపల్లిలోని చిరెక్ క్యాంపస్‌లో వచ్చే నెల రెండు వరకు జరిగే ఈ ఈవెంట్‌లో దేశవ్యాప్తంగా 60 కి పైగా జట్టు అండర్14, అండర్19 జట్లు విభాగాల్లో పోటీ పడనున్నాయి..ఇండియా బాస్కెట్‌బాల్ ప్లేయర్ పుష్ప సెంథిల్‌కుమార్, ఫిబా మాజీ వరల్డ్ టెక్నికల్ డెలిగేట్ నార్మన్ ఇసాక్ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్నారు.