బాలనగర్ జోన్ పరిధిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుండి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు రీఫిలింగ్ చేస్తున్న ఆరు మంది సభ్యుల ముఠాను బాలనగర్ ఎస్ఓటి, జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు.బాలనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ, వారి వద్ద నుండి 67 డోమిస్టిక్,190 కమర్షియల్ మొత్తం(267) సిలిండర్లు, ఫిల్లింగ్ పైపులు(26), ఐదు ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, 4 వేయింగ్ మిషన్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం పరుచుకున్నారు.
సీజ్ చేసిన సిలిండర్ల విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిలో.. గున్నం శివ(34), నూకతొట్టు నరేష్(27), బోయిని సురేష్(35), గారాల మహేష్(28), సాడ్లది నాగ రాజు(39), సురువుల కార్తిక్(21)లు ఉన్నారు. ప్రజలు ఇలాంటి అనధికార ఫిల్లింగ్ సిలిండర్లతో జాగ్రత్త గా ఉండాలని పోలీసులు సూచించారు.