హైదరాబాద్ నుమాయిష్‌ కు 46 రోజుల్లో 17లక్షల 46 వేల మంది

హైదరాబాద్ నుమాయిష్‌ కు  46 రోజుల్లో 17లక్షల 46 వేల మంది

 హైదరాబాద్ మహానగరం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ గా జరుగుతోన్న  నుమాయిష్ కు సందర్శకులు భారీగా వస్తున్నారు. జనవరి 3న ప్రారంభమైన నుమాయిష్ ను  ఇప్పటి వరకు (ఫిబ్రవరి 14)   17 లక్షల 46 వేల 313 మంది సందర్శించారు.  2025 జనవరి 3వ తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్‎ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న ముగియాల్సి ఉన్న నుమాయిష్ ను  ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుల కోరిక మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఫిబ్రవరి 17 వరకు పొడిగించారు. 

1938లో ప్రారంభమైన  నుమాయిష్.. ప్రతియేటా హైదరాబాద్ మహానగరంలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. కుటీర పరిశ్రమల్లో తయారైన వస్తువులతో సహా దేశ విదేశాలకు చెందిన అనేక వస్తువులు నుమాయిష్ లో అమ్మకానికి పెడతారు. ఈసారి దాదాపు 2వేల స్టాల్స్ ఏర్పాటు చేశారు.  ఈ సంవత్సరం కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Also Read:-నడక దారిలో పులి.. గుంపులు గుంపులుగా కొండెక్కుతున్న భక్తులు..

నుమాయిష్ ఎంట్రీ  టికెట్ ధర  50 రూపాయలు. 5 ఏళ్ళ లోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ  ఉండదు. జనవరి 7 వ తేదీ లేడీస్ డేగా జరుపుతారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల 30  వరకు నుమాయిష్ సందర్శించవచ్చు.  వీక్ ఎండ్స్, హాలీ డేస్ లలో రాత్రి 11 వరకు నిర్వహిస్తారు. 

నుమాయిష్‎లో ఈసారి రెండు వేల స్టాళ్లు ఏర్పాటు చేయగా ఎంట్రీ ఫీజును రూ.50గా నిర్ణయించారు. మినీ ట్రైన్‎తో పాటు డబుల్ డెక్కర్ బస్సు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్​కొనసాగుతుంది.  కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లభించే అన్ని రకాల వస్తువులను నుమాయిష్ లోని రెండు వేల స్టాల్స్‎లో ఏర్పాటు చేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయంతో సొసైటీ పలు విద్యాసంస్థలను నిర్వహిస్తోంది.