Hyderabad Real Estate : హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దూకుడు.. జోరందుకున్న ఇళ్ల అమ్మకాలు

Hyderabad Real Estate : హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దూకుడు.. జోరందుకున్న ఇళ్ల అమ్మకాలు

హైదరాబాద్ లో  రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. క్రమేనా రియల్ ఎస్టేట్  రంగం  గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది.  సిటీలో  ఇళ్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2024  త్రైమాసికం (జూలై నుంచి సెప్టెంబర్ వరకు) 12,700 ఇళ్లు అమ్మబడ్డాయి. అలాగే అదనంగా 13, 900 యూనిట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.  అయితే రెండవ త్రైమాసికంతో పోలిస్తే గృహాల అమ్మకాలు 16 శాతం తగ్గాయి. అయినప్పటికీ  కొత్త ఇళ్ల విక్రయాలు ఒక శాతం పెరిగాయని అనారక్ స్టడీ తెలిపింది.

పశ్చిమాన రియల్ దూకుడు

ముఖ్యంగా హైదరాబాద్ లో  పశ్చిమ ప్రాంతంలో భారీగా అమ్మకాలు పెరిగాయి.  ఈ త్రైమాసికంలో మొత్తం ఇళ్ల అమ్మకాలలో 53 శాతం  వెస్ట్ జోన్‌లో జరుగుతున్నాయి. దీని తరువాత నార్త్  జోన్‌లో 28 శాతం,  సౌత్ జోన్ లో  13 శాతం, ఈస్ట్  జోన్‌లో 4 శాతం  అమ్మకాలు జరిగాయి. సెంట్రల్ హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో కేవలం  ఒక శాతం మాత్రమే జరిగాయి.

అద్దె ధరల పెంపు

హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ల సగటు అద్దె చదరపు అడుగుకు 7,150కి చేరుకుంది. గత మూడు నెలల్లో ఇళ్ల అద్దెలు 1 నుంచి 4 శాతం పెరగ్గా, అపార్ట్‌మెంట్ల ధరలు చదరపు అడుగుకు 3 నుంచి 5 శాతం పెరిగాయి. LB నగర్‌లో చదరపు అడుగు అద్దె రూ. 6,800, మియాపూర్‌లో రూ. 6,700, గచ్చిబౌలిలో  రూ. 8,900, కొండాపూర్‌లో  రూ. 8,600. డబుల్ బెడ్రూం, ట్రిపుల్ బెడ్రూం  ఇళ్లకు అద్దె నెలకు రూ.14,000 నుంచి రూ. 42,000 వరకు ఉంటుంది.

ఔటర్ దాటిన రియల్  ఎస్టేట్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. సిటీ  రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ (ORR) దాటి విస్తరించింది. ప్రత్యేకించి ORR పరిధిలో  స్థలం కానీ..ఇండిపెండెంట్  ఇళ్ల  ప్లాట్లు  అందుబాటులో ఉన్నాయి . అలాగే  ఈ ప్రాంతాల్లో విల్లాలు కూడా నిర్మించబడుతున్నాయి. విజయవాడ, ముంబయి, నాగ్‌పూర్ , శ్రీశైలానికి వెళ్లే రహదారుల  వెంట రియల్ ఎస్టేట్ రంగం ఔటర్ రింగ్ రోడ్డు దాటింది. ఈ ప్రాంతంలో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి .  ప్రస్తుతం  అపార్ట్‌మెంట్‌లు,ఇండిపెండెంట్ ఇళ్లు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్నాయి.