
ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జూన్ 22 న అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మోజో ప్రైవేట్ బస్సు 25 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండకు రాగానే హైటెన్షన్ వైర్లు బస్సుకు తగలడంతో షార్ట్ సర్క్యూట్జరిగింది.
డ్రైవర్ అప్రమత్తం అయి ప్రయాణికులను బస్సులోంచి దింపేశాడు. అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో బస్సుతో పాటు ప్రయాణికుల లగేజీ మొత్తం దగ్ధం అయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.