గచ్చిబౌలి/జూబ్లీహిల్స్, వెలుగు : గడిచిన 45 రోజుల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న 1,190 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ ఆఫీసులో క్రైమ్ డీసీపీ నర్సింహ బాధితులకు అందజేశారు. వీటి విలువ 2.50 కోట్లు ఉంటుందని
తెలంగాణతోపాటు యూపీ, బిహార్, ఒడిశా, బెంగాల్ ప్రాంతాలకు వెళ్లి రికవరీ చేశామన్నారు. అలాగే జూబ్లీహిల్స్స్టేషన్పరిధిలో పోగొట్టుకున్న 15 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు ఏసీపీ వెంకటగిరి తెలిపారు. శుక్రవారం బాధితులకు అందజేశారు.